నిరుపేద కుటుంబాలకు చెందిన క్రిస్టియన్లు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

నిరుపేద కుటుంబాలకు చెందిన క్రిస్టియన్లు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం వెంకటేశ్వర హిల్స్ కాలనీలోని అమేజింగ్ గ్రేస్ బాప్టిస్ట్ చర్చి నందు జిల్లా మైనార్టీ కార్యాలయంలో ఆద్వర్యంలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ చర్చి పరిధిలో ఉన్న 200 మంది నిరుపేదలకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తున్నదని, జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 10 లక్షల రూపాయల విలువై కానుకలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పారు. ముందస్తుగా ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కోవిడ్ బారిన పడకుండా 2వ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. అందరూ సుఖసంతోషాలకు ఆనందంగా, సంతోషంగా ఉండాలని చెప్పారు. కాలనీలో సిసి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, యంపిడిఓ రవీందర్, తహసిల్దార్ స్వామి, ఎలసిఎస్ వైస్ ఛైర్మన్ శ్రీకాంత్, కో ఆపరేటివ్ డైరెక్టర్ నారాయణరావు, ఫాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post