నిరుపేద తోటి దళితుల కోసం దళిత బంధు పథకం డబ్బులను వదులుకున్న ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులు అందరికి ఆదర్శనీయులు.

పేదల కోసం దళిత బంధు వదులుకున్న ఆదర్శనీయులు

-౦౦౦-

నిరుపేద తోటి దళితుల కోసం దళిత బంధు పథకం డబ్బులను వదులుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరికి ఆదర్శనీయులు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద, దళిత కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలేట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆగష్టు 16 న హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించి ఎంపిక చేసిన 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసి పథకాన్ని ప్రారంభించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాలలో 21 వేల దళిత కుటుంబాలను గుర్తించి వారందరికి 10 లక్షల చొప్పున దళిత బంధు క్రింద మంజూరు చేయుటకు ప్రభుత్వం నిర్ణయించింది. దళిత బంధు పథకం క్రింద లబ్ధిదారులు 30 రకాల స్వయం ఉపాధి పథకాలను ఎంచుకొనుటకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం క్రింద హుజురాబాద్ నియోజకవర్గానికి 2 వేల కోట్ల నిధులు మంజూరు చేసింది. నియోజకవర్గంలో దాదాపు 350 సర్వే బృందాలతో దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన లబ్ధిదారులందరికి బ్యాంకులలో ప్రత్యేక దళిత బంధు ఖాతాలను తెరిపించారు. ఇంతవరకు హుజురాబాద్ నియోజకవర్గంలో 14,421 మంది లబ్ధిదారుల ఖాతాలలో దళిత బంధు నిధులు ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన అర్హులైన లబ్ధిదారులందరికి ప్రతి రోజు వారి ఖాతాల్లో దళిత బంధు నిధులు జమ చేస్తున్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్ లో 4 గురు లబ్ధిదారులు జమ్మికుంట మండలంలో ఒక లబ్ధిదారు తమకు మంజూరైన దళిత బంధు పథకం క్రింద మంజూరైన 10 లక్షల రూపాయలను పలువురు దళిత ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తాము ఆర్థికంగా అభివృద్ధి చెందామని, ప్రతి నెల రిటైర్డ్ పెన్షన్ పొందుతున్నామని, తమకు వద్దని గీవిట్ అప్ అని ప్రభుత్వానికి వాపస్ ఇచ్చి ఆదర్శంగా నిలిచారు.

హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్ లో 4 గురు జమ్మికుంట మండలంలో కోరపల్లిలో ఒక దళితుడు, మేము ఆర్థికంగా ఉన్నామని దళిత బంధు డబ్బులను గీవిట్ అప్ క్రింద ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారని, వీరు తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర మంత్రులు తన్నీరు హరిష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.

1. కర్రే నరసింహా స్వామి, హుజురాబాద్ :

నేను గెజిటెడ్ ప్రాధానోపాధ్యాయునిగా పదివి విరమణ పొందానని, నా భార్య కూడా
ప్రభుత్వ టీచర్ గా పదవి విరమణ పొందిందని తెలిపారు. నేను అంబేద్కర్ వాదినని, అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తూ వారు చూపిన బాటలో నడుస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను ఆసరా చేసుకొని తాము ఉన్నత స్థితికి చేరుకున్నామని, ఇంక ఎందరో దళితులు అట్టడుగు స్థితిలో ఉన్నారని అన్నారు. పేద, దళిత కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం దళిత బంధు పథకం క్రింద 10 లక్షలు మంజూరు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. మేము ఆర్థికంగా ఉన్నామని, నాకు వచ్చిన రూపాయలు ఇతర పేద కుటుంబాలకు ఉపయోగపడాలనే ఉద్ద్యేశంతో వాపస్ ఇచ్చామని తెలిపారు.

2. సోటాల మోహన్ రావు, రిటైర్డ్ పంచాయితీ రాజ్ ఇంజనీర్, హుజురాబాద్:

హుజురాబాద్ పట్టణానికి చెందిన సోటాల మోహన్ రావు పంచాయితీ రాజ్ శాఖలో
అసిస్టెంట్ ఇంజనీర్ గా 35 సంవత్సరములు సర్వీస్ చేసి రిటైర్డ్ అయినారని తెలిపినారు. నేను ఒక దళితున్ని అని దళిత కుటుంబాలు ఎన్నో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారని, నాకు మంజూరైన దళిత బంధు డబ్బులు ఇంకో దళిత కుటుంబానికి ఇస్తే వారు అభివృద్ధి చెందితే నాకు ఎంతో తృప్తి అని అందుకే వదులుకున్నాని తెలిపారు. రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ నాకు సరిపోతుందని, అందుకే తనకు వచ్చిన 10 లక్షల రూపాయలను గీవిట్ అప్ అని వదులుకున్నానని తెలిపారు.

3. కర్రే కిరణ్ కుమార్, రైల్వే లో డిప్యూటీ ఇంజనీర్ గా ఉద్యోగి:

హుజురాబాద్
ప్రస్తుతం రైల్వేలో డిప్యూటీ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ మంచి జీతంతో ఉన్నత
స్థితిలో జీవిస్తున్నానని, మా తండ్రి, తల్లి ప్రభుత్వ టీచర్లుగా పదవి విరమణ పొందారని, వారికి కూడా పెన్షన్ వస్తుందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం క్రింద మంజూరు చేసిన 10 లక్షల రూపాయలను ఇతర పేద దళితు కుటుంబాలకు ఉపయోగపడాలని, గీవిట్ అప్ అని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చానని తెలిపారు.

4. కర్రే ప్రవీణ్ కుమార్, హుజురాబాద్, హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజనీరు:

నేను ప్రస్తుతం హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నానని నెలకు
2.5 లక్షల రూపాయల జీతం వస్తుందని తెలిపారు. డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్ వల్ల ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం ఆర్థికంగా ఉన్నామని, ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో దళిత కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసి సమాజంలో ఇతర కులాలతో సమానంగా ఉంచుటకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం పేద దళిత కుటుంబాలలో వెలుగు నింపేదిగా ఉండాలని కోరారు. అందుకే ఆర్థికంగా ఉన్న నేను దళిత బంధు పథకం నిధులు గీవిట్ అప్ అని వాపస్ చేసినట్లు తెలిపారు.

5. ఎడ్ల రవీందర్, కోరపల్లి గ్రామం, జమ్మికుంట మండలం:

కోరపల్లికి చెందిన ఎండ్ల రవీందర్ ప్రభుత్వ ఉద్యోగిని కాదు, తన తండ్రి విశ్రాంత
రైల్వే ఉద్యోగి అని తెలిపారు. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, తన తండ్రికి కూడా దళిత బంధు పథకం క్రింద 10 లక్షలు మంజూరైనావని, వాటితో ఏదైన యూనిట్ ఎంచుకొని దానిని నడుపుకుంటూ జీవిస్తామని తెలిపారు. అందుకే తన పేరున వచ్చిన దళిత బంధు 10 లక్షల రూపాయలను గీవిట్ అప్ అని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చినట్లు తెలిపారు.

 

Share This Post