నిరుపేద యువకులకు అందుబాటులో గ్రంథాలయ సేవలు…

ప్రచురణార్థం

నిరుపేద యువకులకు అందుబాటులో గ్రంథాలయ సేవలు…

మహబూబాబాద్ అక్టోబర్ 5.
పోటీపరీక్షలకు సమాయత్తమయ్యే యువత కు గ్రంథాలయ సేవలు ఉపయోగపడాలని జిల్లా కలెక్టర్ శశాంక ఉన్నారు.

మంగళవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ 1.80 కోట్లతో నిర్మించిన గ్రంథాలయ నిర్మాణ పనులను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.

గ్రంథాలయ పనులు నాణ్యత పరంగా ఉండటంతో కలెక్టర్ సంతృప్తి చెందారు. గ్రంథాలయాన్ని అన్ని హంగులతో పూర్తి చేసి నిరుపేద యువతకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అదనపు నిధులు కొరకు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

కలెక్టర్ వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ సురేష్ గ్రంథాలయ సెక్రటరీ శ్రీలత పాల్గొన్నారు
————————————–+
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post