నిరు పేద‌ల‌కు సాయం..సీఏం సహాయ నిధి..

నియోజకవర్గ పరిధిలోని 170 మంది లబ్ధిదారులకు సీఏంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

చెక్కులను వెంటనే తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచన

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు

ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

సోమవారం ఉదయం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 170 మంది లబ్ధిదారులకు రూ.61 లక్షల 44 వేల రూపాయల మేర సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద‌లు సాయం.. పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్ధిపేట నియోజకవర్గమే నిదర్శనమని మంత్రి చెప్పారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు, గ్రామ ప్రజాప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు.

Share This Post