నిర్ణీత గడువు లోగా వ్యాక్సినేషన్ లక్ష్యాలు చేరుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన తేదిః 07-12-2021
నిర్ణీత గడువు లోగా వ్యాక్సినేషన్ లక్ష్యాలు చేరుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, డిసెంబర్ 07: జిల్లా వ్యాప్తగా వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు సిబ్బంది ప్రతిరోజు ఉధయం, రాత్రుల్లు అందుబాటులో ఉండి నిర్ణిత గడువులోగా వ్యాక్సినేషన్ లక్ష్యాలు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. స్పేషల్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ మరియు మధ్యాహ్నం జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా మండల ప్రత్యేకాధికారలు, మెడికల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమీషనర్లతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,
జిల్లాలో నిత్యం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించినప్పటికి ఆశించిన ప్రగతిని కనబరచడం లేదని, జిల్లా వ్యాప్తంగా 18 మండలాల వారిగా వ్యాక్సిన్ అందించాల్సిన సంఖ్య ఎక్కువగా ఉన్న మండలాల్లో రాత్రి వరకు సిబ్బంది ఉండి డోర్ టు డోర్, ఇతర కార్యక్రమాల ద్వారా వ్యాక్సిన్ అందించాలని సూచించారు. వ్యాక్సిన్ లు ఎక్కువగా అందించాల్సిన గ్రామాల వారిగా మొదటి విడత ప్రత్యేక అధికారలు, రెండవ విడత గ్రామాలలో మెడికల్ అధికారులు అందుబాటులో ఉండి వ్యాక్సిన్ లను అందించాలని, అదే విధంగా జిల్లాలోని 5 మున్సిపాలిటిల వారిగా జగిత్యాల డా. పి. శ్రీధర్, కోరుట్ల డా సమియుద్దన్, మెట్పల్లి డా. శ్రీపతి, ధర్మపురి డా. శ్రీనివాస్ మరియు డా. జైపాల్ రెడ్డి రాయికల్ మున్సిపాలిటిలలో ప్రత్యేక కార్యచరణతో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కోన్నారు.
ప్రతిమండలం వారిగా 1000, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటిలలో 2000, మరియు జగిత్యాల, మెట్ పల్లి, కోరుట్ల లో 3000 మందికి ప్రతిరోజు వ్యాక్సిన్ అందించేలా కార్యచరణను రూపొందించుకోని, జిల్లాలో ప్రతిరోజు 20 వేల వ్యాక్సిన్ లను అందించాలని పేర్కోన్నారు. వ్యాక్సిన్ లను అందించడంలో నిర్దేశించిన లక్ష్యం మేర ఎందుకు ప్రగతిని సాధించలేక పోతున్నారో ప్రతి మండలం వారిగా సమీక్షించుకొవాలని సూచించారు.
స్పెషల్ వ్యాక్సినేషన్ లో బాగంగా విధులు నిర్వహించే సిబ్బందికి రవాణా, టిఫిన్, బోజనం, టీ వంటి సౌకర్యాలను అందించాలని, వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించే వరకు యంపిడిఓలు, తహసీల్దార్లు స్థానికంగా ఉండాలని, వ్యాక్సిన్ లను అందించడం కొరకు రాత్రివరకు విధులు నిర్వహించే సిబ్బంది కొరకు యంపిడిఓలు, తహసీల్దార్లు ప్రత్యేకాధికారులు అందుబాటులో ప్రభుత్వ లేదా ప్రభుత్వ అద్దే హవానాల ద్వారా వారిని ఇంటివద్ద చేర్చాలని ఆదేశించారు.
డోర్ టు డోర్ సర్వే ద్వారా మొదటి విడత వ్యాక్సిన్ పూర్తయిన ప్రతి ఇంటికి స్టిక్కర్లును అతికించాలని, మొదటి డోస్ పూర్తయిన వారు ఎంతమంది ఉన్నారు, వారికి రెండవ డోస్ కొరకు ఎంతసమయం ఉందని గుర్తించి వారికి వ్యాక్సిన్ అందించాలని సూచించారు. వ్యాక్సినేషన్ కొరకు సిబ్బంది కొరత ఉన్నట్లయితే, ఇతర బృందాలలోని సిబ్బందిని వినియోగించుకోని లక్ష్యాలను సాధించాలని పేర్కోన్నారు. లక్ష్యాలను సాధించాలని, అవకతవకలకు పాల్పడినట్లు దృష్టికి వచ్చినట్లయితె మెడికల్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
గైనకాలజిస్టులతో సమావేశం నిర్వహించి గర్బినీలకు వ్యాక్సిన్ అందించడం ద్వారా ఎటువంటి అపాయం కలగదని అవగాహన కల్పించాలని పేర్కోన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం పై విముఖత చూపే వారి కొరకు కమ్యూనిటి మత పెద్దల ద్వారా అవగాహన కల్పించాలని పేర్కోన్నారు. అంగన్ వాడి సిబ్బందిని సాయంత్రం స్పెషల్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గోనేలా ఆదేశించాలని పేర్కోన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రతి గంట పరిశీలించడంతో పాటు ఆకస్మిక తనిఖీలను నిర్వహించడం జరుగతుందని పేర్కోన్నారు.
ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ జగిత్యాల, కొరుట్ల ఆర్డిఓలు శ్రీమతి అర్.డి. మాదురి, టి. వినోద్ కుమార్, జిల్లా వైద్యాధికారి పి. శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్లు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారులు పాల్గోన్నారు.

నిర్ణీత గడువు లోగా వ్యాక్సినేషన్ లక్ష్యాలు చేరుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post