నిర్దేశించిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి- జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

రంగారెడ్డి జిల్లా  సెప్టెంబర్  15::  నిర్దేశించిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లోని కోర్ట్ హాలులో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆర్డీఓలు , మున్సిపల్ కమిషనర్లతో ఎం.పీ.డీ. ఓ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా నిర్దేశించిన హరిత హారం , నర్సరీలు , పల్లె ప్రకృతి వనాలు , బృహత్తర పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాల, డంపింగ్ యార్డులు , సేగ్రిగేషన్ షెడ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ , మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తీ చేయుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గ్రామ సర్పంచ్ , పంచాయతీ సెక్రటరీ ల సమన్వయంతో పనులను పూర్తి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీకి కేటాయించిన బడ్జెట్లో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద హరిత హారం పనులకు వినియోగించాలని అన్నారు. పూర్తి చేసిన అభివృద్ధి పనుల వివరాలను ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పై సమీక్షిస్తూ ఈ నెల 15 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ -2021 కార్యక్రమం నిర్వహణలో భాగంగా శ్రమదానం , ప్లాస్టిక్ నిర్ములన , తడి పొడి చెత్త నిర్వహణ మెరుగైన పారిశుధ్య నిర్వహణతో పాటు మరుగుదొడ్ల వాడకం మరియు నిర్వహణపై అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని విజయవంతం చేయాలని తెలిపారు.
అనంతరం స్వచ్ఛతా హీ సేవ -2021 గోడ ప్రతిని ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి మోతీ , డి. ఆర్డి.ఎ. పి డి ప్రభాకర్ , జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జెడ్ పి సి.ఈ.ఓ దిలీప్ కుమార్, ఆర్డీఓలు , మున్సిపల్ కమిషనర్లు , ఎంపీ డీ ఓలు , ఎంపీఓలు , తదితరులు పాల్గోన్నారు

Share This Post