నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రణాళిక ప్రకారం హరితహారం మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు

నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రణాళిక ప్రకారం హరితహారం మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు

ప్రచురణార్థం

నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రణాళిక ప్రకారం మొక్కలు నాటాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, జూలై -21:

గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి హరిత హారం, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు పై ఎం.పి.డి. ఓ లు, సంభందిత అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయబడలేదు అని, స్థలం సేకరణ కొరకు ఉపయోగంలో లేని ప్రభుత్వ భూములను గుర్తించి యువకులు ఉపయోగించుకునే విధంగా వాటిలో వెంటనే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

8వ విడత హరిత హారం శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను ప్రణాళిక ప్రకారంగా రోజు వారి లక్ష్యం విభజించుకొని రోజు వారీగా మొక్కలు నాటాలని, పెద్ద మొత్తంలో నాటే సందర్భంలో స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో చేయాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించు కోవాలి అని తెలిపారు. మొక్కలు నాటే క్రమంలో మొక్కల ఎదుగుదల చెందే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్ సమయంలో నిర్దేశించిన ఎత్తు ఉన్న వాటిని నాటాలని, తొందరపడి లక్ష్యం పూర్తి చేయిటకు చిన్న మొక్కలను నాటరాదని తెలిపారు. కావాల్సిన మొక్కలు, ఉన్న మొక్కలను నర్సరీ వారీగా, గ్రామ పంచాయతీలో చూసుకొని షార్ట్ ఫాల్ వివరాలను తెలపాలని అన్నారు. చిన్న మొక్కలను ఇళ్లకు అందించాలని తెలిపారు.

గతంలో నేషనల్ హై వే మీద నాటిన ఒక వరుసకు అదనంగా రెండవ వరుస మొక్కలు నాటాలని తెలిపారు. గతంలోని అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్ లో ఉన్న గ్యాప్ లను కవర్ చేయాలని సూచించారు.

ఈ వీడియో సమావేశంలో జెడ్పీ సి. ఈ. ఓ. రమాదేవి, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, జిల్లా అధికారులు, జిల్లాలోని ఎం.పి.డి. ఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post