నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి ….. జిల్లా కలెక్టర్ కే శశాంక.

ప్రచురణార్ధం

నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి ….. జిల్లా కలెక్టర్ కే శశాంక.

మహబూబాబాద్, సెప్టెంబర్-04:

నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కే.శశాంక రెవెన్యూ అధికారులను, తహసీల్దార్ల ను ఆదేశించారు.

శనివారం ప్రజ్ఞ సమావేశ మందిరంలో రెవిన్యూ కార్యకలాపాలపై రెవెన్యూ అధికారులతో, తాసిల్దార్ లతో కలెక్టర్ సమీక్షించారు.

ధరణి, నిషేధిత స్థలాలు, కళ్యాణ లక్ష్మి, రెండు పడక గదుల ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక, అటవీ భూములపై రెవెన్యూ అభ్యంతరాలు, మీసేవ, కోర్టు కేసులు, కోవిడ్ 19 కేసులు, ప్రజా ఫిర్యాదుల లో వచ్చిన దరఖాస్తుల్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తు వివరాలపై సమీక్షించారు.

ధరణి లో ఉదయం 9 గంటల 45 నిమిషాల లోగా లాగిన్ అవ్వాలని, ప్రతి రోజూ లాగిన్ వివరాలను పరిశీలించడం జరుగుతుందని, లాగిన్ అవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలపాలని, కొందరు ఆలస్యంగా ఆఫీస్ కు వెళ్లి login అవుతున్నట్లు
గమనించడం జరిగిందని, ఇకముందు ఖచ్చితమైన టైం కు login అయి దరఖాస్తులను పరిష్కరించాలన్నారు.

పెండింగ్ mutations 48 గంటలలో పూర్తి చేయాలని తెలిపారు.

కోర్టు కేసులు వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రెవెన్యూ లో ఎటువంటి ఫైల్స్ పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కారం కోసం చర్యలు తీసుకొని నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య,
అడిషనల్ కలెక్టర్ కొమరయ్య, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటరమణ, మండలాల తహసీల్దార్లు, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయంచే జారీచేయనైనది.

Share This Post