ప్రచురణార్థం
నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు నిరంతరం తపించాలి…
మహబూబాబాద్,
నెల్లికుదురు నవంబర్ 16.
నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు నిరంతరం తపించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఉద్బోధన చేశారు.
మంగళవారం మండలంలోని ఆలేరు గ్రామాన్ని పర్యటించి జిల్లా విద్యాధికారి తో కలిసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.
పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థుల ప్రతిభాపాటవాలను స్వయంగా పరిశీలించేందుకు వర్షిత తో లెక్కలు చేయించారు.
వర్షిత ప్రతిభను కలెక్టర్ ప్రశంసిస్తూ ఉన్నత విద్యాభ్యాసానికి గురువులచే మార్గనిర్దేశనం చేసుకుంటూ రాణించాలి అన్నారు.
ఉన్నత విద్య అభ్యసించేందుకు విద్యార్థులందరూ తరగతి గది నుండి ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.
అనంతరం పాఠశాల ఆవరణలో ఉన్న త్రాగునీరు మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించారు మరమ్మతులు ఉంటే చేయించుకోవాలని జాప్యం తగదన్నారు.
గ్రంధాలయం కొరకు ఏర్పాటు చేస్తున్న గ్రామపంచాయతీ గదిని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు త్వరితగతిన ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్ వెంట జడ్పిటిసి మేకపొతుల శ్రీనివాస రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ మండల ప్రత్యేక అధికారి బాలరాజు తాసిల్దార్ రఫీ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు సర్పంచ్ రాణి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది