నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలి…జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్ధం

నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలి…

మహబూబాబాద్, జూలై-30:

నిర్దేశించిన రెవిన్యూ కార్యకలాపాల లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ కార్యకలాపాలపై అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీఓ లతో కలిసి తాసిల్దార్ లతో సమగ్రంగా కలెక్టర్ సమీక్షించారు.

ప్రభుత్వ స్థలాలు స్వాధీనం, ఫారెస్ట్ రెవిన్యూ అభ్యంతరాలు, లబ్ధిదారులకు మంజూరు చేయుటకు మూడు ఎకరాలు స్థలం రెండు పడక గదుల ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక, కళ్యాణ లక్ష్మి, మీసేవ, కోర్టు కేసులు కోవిడ్ 19 లపై సమీక్షించారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫారెస్ట్ రెవెన్యూ అభ్యంతరాల పై జాయింట్ సర్వే త్వరితగతిన పూర్తిచేసి పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేసేందుకు భూములను స్వాధీన పరచు కోవాలన్నారు .

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అవుతున్నందున లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభ ద్వారా చేపట్టాలన్నారు.

అలాగే కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను త్వరితగతిన పర్యవేక్షించి మంజూరుకు సిద్ధం చేయాలన్నారు. కోవిడ్ 19 పై ప్రభావిత మండలాల అయినా బయ్యారం డోర్నకల్ మండలాలలో గ్రామ స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు అధికారులు ప్రభావిత గ్రామాల్లో పర్యటించి పాజిటివ్ వ్యక్తులను గుర్తించి గ్రామస్థాయి ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలి అన్నారు.

నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ కొమరయ్య తొర్రూర్ ఆర్డిఓ రమేష్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటరమణ 16 మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు
—————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post