నిర్ధేశిత గడువుకు అనుగుణంగా అనుమతుల మంజూరు : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ టి.ఎస్‌. -ఐపాస్‌ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్ధేశిత కాలవ్యవధికి అనుగుణంగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌లో జరిగిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సహక కమిటీ సమావేశంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ టి.ఎస్‌. -ఐపాస్‌ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు నిర్ధేశించిన ప్రకారము అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. టి-ప్రైడ్‌ పథకం క్రింద 6 యూనిట్లకు గాను 16.82 లక్షల పెట్టుబడి రాయితీ, 7 యూనిట్లుకు గాను 1.167 లక్షల రూపాయలను పావలా వడ్డీ రాయితీ క్రింద మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో పరిశమలను స్థాపించి అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి కల్పన దిశగా ఆసక్తి గల పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఎం. హరనాథ్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హవేలిరాజు, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, మంచిర్యాల మేనేజర్‌ పుల్యానాయక్‌, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post