నిర్ధేశిత లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

బ్యాంకర్లకు నిర్ధేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ట్రైనీ కలెక్టర్‌ ప్రతిభా సింగ్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హవేలిరాజుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని జన్నారంలో ఎస్‌. ఎఫ్‌.ఎ.సి. క్రింద మంజూరైన ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌ను నాబార్జు ఆధ్వర్యంలో త్వరగా అమలులోకి తీసుకురావాలని, ప్రభుత్వం రైతులు, వ్యాపారస్తులు, ఎస్‌.సి., ఎస్‌.టి. కార్పొరేషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పథకాల కోసం అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌లో పంట రుణాల లక్ష్యం 1 వేయి 28 కోట్ల రూపాయలు కాగా 60 శాతంతో 620 కోట్ల రూపాయలు రైతులకు అందించడం జరిగిందని, వ్యవసాయ ధీర్హకాలిక రుణాల లక్ష్యం 805 కోట్ల రూపాయలకు గాను 63 కోట్ల రూపాయలు సాధించడం జరిగిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అందించే రుణ సదుపాయం వార్షిక లక్ష్యం 541 కోట్ల రూపాయాలు కాగా ఇప్పటి వరకు 22 శాతంతో 121 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రాధాన్యత రంగాల అభివృద్ధికి అందించే రుణ వార్షిక లక్ష్యం 3 వేల 409 కోట్ల రూపాయలకు గాను జూన్‌ మాసం వరకు 139 శాతం వరకు 461 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని, ప్రాధాన్యేతర రంగాల రుణ వార్షిక లక్ష్యం 260 కోట్ల రూపాయలకు గాను 151 కోట్ల రూపాయల రుణాలు అందించడం జరిగిందని, జిల్లా వార్షిక ప్రణాళిక లక్ష్యం 3 వేల 669 కోట్ల రూపాయలు కాగా జూన్‌ మాసం వరకు 16 శాతంతో 612 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. 9 వేల 374 స్వయం సహాయక సంఘాలకు అందించే వార్షిక రుణ లక్ష్యం 350 కోట్ల రూపాయలు కాగా 3 వేల 400 సంఘాలకు 187 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముద్ర రుణ సదుపాయం క్రింద 1 వేయి 86 మంది లబ్దిదారులకు 17 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని, స్టాండప్‌ ఇండియాలో 70 పరిశమలకు 18 కోట్ల రూపాయలు రుణం అందించడం జరిగిందని, ప్రధానమంత్రి స్వనిధి పథకంలో భాగంగా 14 వేల 100 మంది వీధి వ్యాపారులకు 10 వేల రూపాయల చొప్పున రుణం అందించడం జరిగిందని తెలిపారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 74 ప్రాజెక్టులకు గాను 18 ప్రాజెక్టులకు మంజూరు చేయడం జరిగిందని, ఎస్‌.సి. కార్పొరేషన్‌ పథకంలో భాగంగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 288 మంది లబ్బిదారులకు సంబంధించి గ్రౌండింగ్‌ చేయవలసి ఉందని, జిల్లాలో ఎన్‌.పి.ఎ. క్రింద 97 కోట్ల రూపాయలు వసూలు చేయవలసి ఉందని, సంబంధిత అధికారులు ఆ దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి, ఆర్‌.బి.ఐ. ఎ.జి.ఎం. శరత్‌, డి.డి.ఎం. అబ్బుల్‌
రవూఫ్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కరీంనగర్‌ ఎ.జి.ఎం. టి. వంశీకృష్ణ తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్‌ పి. హరిగోపాల్‌, ఆదిలాబాద్‌ సహకార బ్యాంక్‌ డి.జి.ఎం. టి.వెంకటస్వామి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post