నిర్మల్ జిల్లా: కలెక్టర్ కార్యాలయ సమావేశ పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులపై మున్సిపల్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తదితరులు.

పత్రికా ప్రకటన
తేది: 11.08.2021

జిల్లాలో పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ పట్టణ ప్రగతి లో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలు, పిల్లల పార్కు, సమీక్రుత మార్కెట్, తదితర పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని, హరితహారం లో భాగంగా ఇఛ్చిన టార్గెట్ ను వారం లోగా పూర్తి చేయాలని అన్నారు. హరితహారం లో ఇప్పటి వరకు బైంసా 72 శాతం, ఖానాపూర్ 26 శాతం మొక్కలు నాటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ లు ఎం. ఎ అలిమ్, గంగాధర్, డి ఈ సంతోష్, ఎ. ఈ వినయ్, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post