నిర్మల్ జిల్లా: జిల్లాలో డెంగు వ్యాప్తి నివారణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తదితరులు.

పత్రిక ప్రకటన
తేది 07.08.2021

సీజనల్ వ్యాదులు, బృహత్ పల్లె ప్రకృతి వనం ల పై శనివారం జిల్లా పాలనాధికారి సమావేశం లో ఎంపిడిఓ, ఎంపిఓ, సంబంధిత అధికారులతో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అత్యవసర సమావేశం ఉదయం 7.00 గంటలకు నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లా లో డెంగ్యూ వ్యాధి నివారణకు తగు చర్యలు చేపట్టాలని అందుకు ఒక రోజు డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా లో ఈ వ్యాధి వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఇప్పటికే 51 కేసులు నమోదయ్యాయని తక్షణమే సమావేశం అనంతరం ఫీల్డ్ కి వెళ్లి డ్రైవ్ నిర్వహించాలని అన్నారు.
ఏడీస్ ఈజై ప్టె అనే జాతి దోమ కాటు వలన మానవ శరీరం లోకి ప్రవేశించి వైరస్ వల్ల వచ్ఛేదే డెంగ్యూ జ్వరం అని, ఈ దోమ మన ఇంటి పరిసరాల్లో నే నివసిస్తుందని పూల కుండీలో, కూలర్లు, పాత టైర్లు, తదితర వాటిలో నిల్వ ఉన్న నీటిలో ఉంటుందని అన్నారు.
ప్రతి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించాలని అన్నారు.

అనంతరం జిల్లాలో చేపట్టిన మెగా ప్రకృతి వనాల బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని, వాకింగ్ ట్రాక్ పూర్తి చేసి మొక్కలను నాటలని పనులలో రాజీ పడకుండా వేగంగా పూర్తి చేయాలనీ అన్నారు.
జి పి నిధులను సక్రమంగా అమలు చేయాలని అన్నారు.
అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే మాట్లాడుతూ పట్టణ, పల్లె ప్రకృతి వనాలు, గ్రామాల్లో స్పీడ్ బ్రేకర్లు, పిల్లల కొరకు ప్లే గ్రౌండ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు ఎంపిడిఓలు, ఎంపి ఓ లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post