నిర్మల్ జిల్లా: జి.ఎస్.ఎఫ్ సేవలు అభినందనీయం: జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.

జి.ఎస్.ఎఫ్ సేవలు అభినందనీయం: జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.

కరోనా మహమ్మారి వలన చదువుకు దూరమైనా విద్యార్థులు పేదరికం,సామజిక కారణాల వలన ఆన్ లైన్ క్లాసులు వినడానికి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తించి, గ్రామీణ్ సపోర్ట్ ఫౌండేషన్ ఛైర్మెన్ నరేష్ కదిరి స్మార్ట్ ఫోన్ లు ఇవ్వడానికి సంకల్పించడం అభినందనీయం జిల్లా కలెక్టర్ అన్నారు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్ లు దుర్వినియోగం చేయకుండా క్రమం తప్పకుండ పాఠాలు వింటూ భవిషత్తును ఉన్నతంగా మార్చుకోవాలని కోరారు.జి.ఎస్.ఎఫ్ ను స్ఫూర్తిగా తీసుకోని యువత సమాజానికి, దేశానికి సేవచేయడానికి ముందుకు రావాలన్నారు. ఈ సందర్బంగా 10 మంది నిరుపేద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ లు అందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మినా, gsf సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post