నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో 7కోట్ల 20లక్షలతో నూతనంగా నిర్మించనున్నసమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నరాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి తదితరులు.

పత్రిక ప్రకటన
తేది 05.08.2021

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రూపాయలు 7కోట్ల 20లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి తో కలసి గురువారం భూమిపూజ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమీకృత మార్కెట్లను ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్నిరకాల వస్తువులు ఒకే దగ్గర లభించేందుకు నిర్మిస్తోందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. భైంసా పట్టణాన్ని ఒక ప్రణాళిక ప్రకారం ఒక్కో పని పూర్తి చేస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముధోల్ ఎమ్మెల్యే కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
శంకుస్థాపన కార్యక్రమంలో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పెర కృష్ణ, వైస్ చైర్మన్ అసిఫ్, భైంసా టిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఫరూక్, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, ఆర్డిఓ రాథోడ్ రాజేశ్వర్, తానూర్ మాజీ ఎంపిపి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
శంకుస్థాపన అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం అన్ని రకాల మార్కెట్ లను ఒక్క దగ్గర ఏర్పాటు చేశామని మార్కెట్ కు సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభమై పనులు 6మాసాల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.
దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నయాని పింఛన్లు, రైతురుణ మాఫీ, కొత్త రేషన్ కార్డులు, దళిత బంధు పథకాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు తీరు అద్బుతమన్నారు. గుండెగామ్ సుద్ధవాగు వరద బాధితులకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో త్వరలోనే పరిష్కారం లభించనున్నట్లు మంత్రి తమ ప్రసంగంలో వెల్లడించారు.

Share This Post