నిర్మల్ జిల్లా: స్థానిక దివ్య గార్డెన్ లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జడ్.పి చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు.

పత్రిక ప్రకటన (2)
తేది 07.08.2021

జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం స్థానిక దివ్య గార్డెన్ లో జడ్పి ఛైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అధ్యక్షతన నిర్వహించి జిల్లా ప్రగతి పై చర్చించడం జరిగినది.
ఎం ఎల్ ఏ విఠల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గం లోని సమస్యలను జిల్లా పాలనాధికారి, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

నూతన డి సి సి బి చైర్మన్ రఘునందన్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు.

జడ్పి ఛైర్పర్సన్ మాట్లాడుతూ రైతులకు 50 శాతం ఋణ మాఫీ చేయడం జరిగిందని అన్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు స్నేహాభావంతో ముందుకు వెళ్లాలని, మన జిల్లా ను ప్రత్యేక జిల్లా గా అభివృద్ధి పథం లో ముందుకు తీసుకు రావాలని అన్నారు.

ముఖ్యమైన శాఖలైన విద్య, విద్యుత్, ఇరిగేషన్, వ్యవసాయం, వెటర్నరీ శాఖల అభివృద్ధి పనులపై సమీక్షించారు.
జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా అనుకోని పరిణామం సంబవించి వ్యవసాయం, పంచాయతీ, ఇరిగేషన్, విద్యుత్, మున్సిపల్, రెవిన్యూ ఆయా శాఖలకు సంబంధించిన నష్ట పరిహారం కొరకు ప్రభుత్వానికి నివేదిక పంపించామని అన్నారు.
చిన్న చిన్న సమస్యలను ఇక్కడే పరిష్కరించుకోవాలని అన్నారు.
జడ్పి సమావేశానికి ముందు ఇటీవలే మరణించిన డి సి సి బి చైర్మన్ కాంబ్లె నాందేవ్, ముధోల్ మండల్ కారేగాం సర్పంచ్ కీర్తన రెడ్డి, లోకేశ్వరం ఎంపీఓ వెంకటరమణయ్య లకు రెండు నిముషాలు మౌనం పాటించి సభ ను ప్రారంభించారు.

జారీ చేసిన వారు జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్.

Share This Post