బుధవారం కలెక్టర్ చాంబర్ నందు డిఆర్ఓ, పంచాయతీరాజ్, గిరిజన ఇంజనీరింగ్ విభాగం, విద్యుత్, డిఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్లుతో రెండు పడక గదుల ఇండ్ల సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలు పూర్తయిన సముదాయాలను ప్రారంభోత్సవాలు నిర్వహించి లబ్దిదారులకు పంపిణీ చేయుటకు జాబితాను సిద్ధం చేయాలని చేయాలని చెప్పారు. విద్యుత్, మంచినీటి సరఫరాతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ జరగాలని చెప్పారు. విద్యుత్ సౌకర్యం కల్పనకు అంచనా నివేదికలు అందచేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్ కు సూచించారు. విద్యుత్ సౌకర్యం కల్పనకు విద్యుత్ శాఖ అధికారులకు డిమాండ్ నోటీసులు ఇస్తే అంచనా ప్రకారం విద్యుత్ సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. లో ఓల్టేజి లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యుత్ సౌకర్యం కల్పనపై నివాసితులతో పాటు పంచాయతీరాజ్, గిరిజన ఇంజనీరింగ్ అధికారులు, విద్యుత్ అధికారులు సంయుక్త ధృవీకరణ పత్రంతో పాటు నిధులు వినిమయ ధృవీకరణను డిఆర్డిఓకు అందచేయాలని చెప్పారు. రానున్న మూడు నెలల్లో పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న సముదాయాలకు కూడా విద్యుత్, మంచినీటి సౌకర్యాలు కల్పనకు చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. రెండు పడక గదుల ఇండ్ల సముదాయాల్లో అక్రమంగా విద్యుత్ వినియోగం జరుగకుండా చర్యలు చేపట్టాలని, అక్రమ విద్యుత్ వినియోగం వల్ల ఏదేని ప్రమాదం వాటిల్లినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని తగు చర్యలు తీసుకోవాలని ఆయన విద్యుత్ అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, పంచాయతీరాజ్ ఈ ఈ సుధాకర్, గిరిజన సంక్షేమ శాఖ ఈ ఈ రాములు, విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.