నిర్మాణ రంగంలో గిరిజన యువతకు ఉపాధి

గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం జాతీయ భవన నిర్మాణ సంస్థ ( NATIONAL

ACADEMY OF CONSTRUCTION) వారి సమన్వయంతో వివిధ ఉపాధి కోర్సులో ఉచిత

శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా B.Tech సివిల్ ఇంజనీరింగ్ పూర్తి

చేసిన గిరిజన యువతకు ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రాం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ నాటి

కార్యక్రమంలో Batch – IV లో శిక్షణ పూర్తి చేసిన 39 మంది గిరిజన అభ్యర్థులకు శిక్షణ

మరియు ప్లేస్ మెంట్ ఆఫర్ లెటర్స్ డా. క్రిస్టినా జెడ్ చొంగ్తూ I.A.S., సెక్రెటరీ మరియు

కమీషనర్, గిరిజన సంక్షేమ శాఖ గారు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా

మాట్లాడుతూ “గిరిజన యువత ఈ శిక్షణ అవకాశాన్ని వినియోగించుకొని మంచి ఉద్యోగ

అవకాశాలు పొందాలని మరియు మంచి భవిష్యత్తు పొందాలని” కోరారు. పట్టుదల మరియు

క్రమ శిక్షణతో మంచి ఉద్యోగ అవకాశాలు సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో శ్రీ. E. శ్రీధర్, I.A.S., స్పెషల్ సెక్రెటరీ, గిరిజన సంక్షేమ శాఖ గారు

మాట్లాడుతూ “గిరిజన యువతకు ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రాం శిక్షణతో వారి నైపుణ్యలను

పెంచుకోవడానికి సదవకాశం కలిగిందని, మంచి నిబద్దతో పని చేసి మంచి స్థాయికి ఎదగాలని

మంచి ఇంజనీర్లుగా పేరు తెచ్చుకోవాలని” సూచించారు. తదనంతర శిక్షణ పొందిన 39 మంది

గిరిజన అభ్యర్థులకు శిక్షణ సర్టిఫికేట్లు మరియు ప్లేస్ మెంట్ లెటర్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ కే.బిక్షపతి DG, NAC, శ్రీ కే. శంకర రావు, GM, ట్రైకార్ మరియు శ్రీ M . లక్ష్మి ప్రసాద్, స్టేట్ మిషన్ మేనేజర్ గారు పాల్గొన్నారు.

Share This Post