నిర్లక్షం వహించిన వారి పై చర్యలు తప్పవు:: జిల్లా కలెక్టర్ డి హరిచందన

నిర్లక్షం వహించిన వారి పై చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ డి హరిచందన

సోమవారం స్కిల్ దౌలప్మెంట్ సెంటర్ లో APMలు CC లతో జిల్లా కలెక్టర్ డి హరిచందన నిర్వహించిన సమీక్షా సమావేశం మాట్లాడుతూ నిర్లక్షం వహించిన వారి పై చర్యలు తప్పవని హెచ్చరించారు.  ప్రస్తుత SLBC గైడ్ లైన్స్ ప్రకారం అర్హత గల ప్రతి స్వయం సహాయక సంఘానికి 10 లక్షల వరకు బ్యాంక్ లింకేజీ జరగాల్సి ఉన్నది. ఈ 2021-22 ఆర్థిక సంవత్సరానికి 7335 సంఘాలకు  లకు రూ.192.48/- కోట్ల లింకేజీ జరగాల్సి ఉండగా ప్రస్తుతానికి 2380 సంఘాలకు రూ.92.59 కోట్లు మాత్రమే జరిగింది. మిగిలిన 100 కోట్ల లక్ష్యానికి సాధించడానికి సమయం చాలా తక్కువగా ఉన్నందున సెర్ప్ సిబ్బంది అందరూ కూడా క్షేత్ర స్థాయిలో ఇంకా బాగా పనిచేయాల్సి ఉన్నదని., కమ్యూనిటీ తోనూ అసెట్ క్రియేషన్ చేయిస్తూ మరియు బ్యాంక్ అధికారులతో సరియైన సమన్వయం తో ,ఖచ్చితమైన MCP లు సకాలంలో సంబంధిత బ్యాంక్ బ్రాంచిలకు సమర్పించి మన నారాయణపేట జిల్లా బ్యాంక్ లింకేజీ లక్ష్యాన్ని సాధించాలని నిర్ధేశించడం జరిగింది. లక్ష్య సాధనలో వెనుక బడిన సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సమావేశం లో వెంకట్, డిఅర్దిఒ గోపాల్ నాయక్, డిపియం రాము తదితరులు పాల్గొన్నారు.

Share This Post