నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం.

ప్రచురణార్థం

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం.

మహబూబాబాద్ సెప్టెంబర్ 27.

ప్రభుత్వ ఆసుపత్రికి నిరుపేదలు ఎక్కువ గా వస్తుంటారని నిర్మాణ పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శశాంక హెచ్చరించారు.

సోమవారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ హాస్పటల్ ను సందర్శించి భారీ వర్షాలకు నీరు చేరి సీలింగ్ లో కొద్ది భాగం ఊడిపడిన ఐసీయూ గదిని, అదనపు పడకల కొరకు ఆస్పత్రి పైభాగంలో చేపడుతున్న నిర్మాణ పనులు అధికారులతో సందర్శించి పరిశీలించారు.

భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన నిర్లక్ష్యం వహించడంతోనే ఈ సంఘటన జరిగిందని, ఇది కేవలం కాంట్రాక్టర్ తో పాటు అధికారుల నిర్లక్ష్యము కూడా ఉందన్నారు. ఇక ముందు ఇటువంటి సంఘటనలను సహించబోమని పునరావృతం కారాదన్నారు.

హాస్పిటల్ నిర్మాణ పనులు ఇంజనీరింగ్ అధికారులు చూసుకుంటారని డాక్టర్లు పర్యవేక్షణ చేయకపోవడం తగదన్నారు.

ప్రభుత్వ హాస్పిటల్ లో ఏ పని జరిగినా డాక్టర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. కొద్ది భాగం సీలింగ్ వూడి పడడం సమయానికి దీనికింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఇంజనీరింగ్ అధికారులకు హాస్పిటల్ లో చేపడుతున్న పనులపై అవగాహన ఉండి తీరాలన్నారు.

ఇకపై ఇలాంటి సంఘటనలు జరగరాదని తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయన్నారు.

కలెక్టర్ వెంట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు వెంకట రాములు టీఎస్ ఎమ్ ఐ డి సి ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాస్ కాంట్రాక్టర్ తంగం తదితరులు పాల్గొన్నారు
————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post