నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లనూ విక్రయించుకునేందుకు ప్రభుత్వం అనుమతి: ఆర్డీవో mmr రెహాబిలిటేషన్ రేసేటలేమెంట్ అధికారి టి. శ్రీనివాస రావు

*నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్ లను*
*విక్రయించుకునేందుకు ప్రభుత్వం* *అనుమతి:ఆర్డీఓ,MMR రిహబిలీటేషన్,* *రిసేటిల్మెంట్ అధికారి శ్రీ టి శ్రీనివాస్ రావు*
——————————

మధ్య మానేరు జలాశయం నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్ లను క్రయ, విక్రయాలు జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సిరిసిల్ల ఆర్డీఓ, MMR రిహబిలీటేషన్, రిసేటిల్మెంట్ అధికారి శ్రీ టి శ్రీనివాస్ రావు తెలిపారు.

ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

MMR నిర్వాసితులు తమకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ లను అమ్ముకునేందుకు వెసులు బాటు కల్పించవలసిందిగా కోరుతూ పలుమార్లు వేములవాడ శాసన సభ్యులు శ్రీ చెన్నమనేని రమేష్ బాబు, చొప్పదండి శాసన సభ్యులు శ్రీ సుంకే రవి శంకర్ తో పాటు రాష్ట్ర మంత్రి శ్రీ కే తారకరామారావు గారికి విజ్ఞప్తి చేశారు.
స్పందించిన మంత్రి వారి విజ్ఞప్తులను ప్రభుత్వానికి నివేదించవలసిందిగా జిల్లా కలెక్టర్,రిహబిలీటేషన్, రిసేటిల్మెంట్ అధికారులకు సూచించారు.

మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంకు నివేదించారు.

సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 13 గ్రామాలకు చెందిన MMR నిర్వాసితులకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ల విక్రయాలకు అనుమతించింది.

*నిర్వాసితుల హర్షం… మంత్రి శ్రీ కేటిఆర్ గారికి ధన్యవాదాలు*

తమ విజ్ఞప్తులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల మధ్య మానేరు జలాశయం నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి శ్రీ కే తారక రామారావు గారికి, వేములవాడ శాసన సభ్యులు శ్రీ చెన్నమనేని రమేష్ బాబు, చొప్పదండి శాసన సభ్యులు శ్రీ సుంకే రవి శంకర్ గార్లకు నిర్వాసితులు
ధన్యవాదాలు తెలిపారు.

—————————–

Share This Post