నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -నాగర్ కర్నూలు జిల్లా పి. ఉదయ్ కుమార్

నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -నాగర్ కర్నూలు జిల్లా పి. ఉదయ్ కుమార్

 

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా  కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సూచించారు.

శుక్రవారం తాడూర్ మండలం ఆకునెల్లి కుదురు వద్ద రోడ్డు పై నుండి  ఉధృతంగా పడుతున్న  కాలువను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు రోడ్డు దాటకుండా కాపలా పెట్టాలని ఆదేశించారు. ఇంకో రెండు రోజులు ఇదేవిధంగా వర్షాలు ఉన్నందున రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణ హాని కలుగకుండా చూడాలని ఆదేశించారు.

వర్షాల వల్ల బాగా నాని కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను గుర్తించాలని, అందులో ఉంటున్న ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నీరు నిల్వ ఉండే ప్రదేశాలకు ఎవరూ వెళ్లొద్దన్నారు. దుస్తులు ఉతికేందుకు, ఈత కొటేటందుకు, చేపలు పట్టేందుకు వెళ్లొద్దన్నారు.

జలాశయాలు పొంగి నీరు వచ్చే రహదారులు, బ్రిడ్జీలు, కాజ్‌వేలు,  వాగులు, వంకలు, చెరువులను గుర్తించాలన్నారు.

పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కలెక్టరేట్ లో 24 గంటలు పని చేసేలా బృందాలను నియమించ  కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు.

ఏదైన సమాచారం ఉంటే కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 08540- 230201కు తెలుపాలన్నారు.

ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లు అప్రమత్తమై ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందజేయాలని ఆదేశించారు.

Share This Post