నివారణ చర్యలతోనే డెంగ్యూను నియంత్రించవచ్చు, విస్తృత ప్రచారం కల్పించాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

డెంగ్యూ, మలేరియాపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ ఆదేశించారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నాగర్ కర్నూలు పట్టణంలోని రామాలయం వీధి ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో డెంగ్యూ వ్యాధి నివారణకు అవగాహన ర్యాలీ ని ప్రారంభించి, దోమల నియంత్రణ చర్యల కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, నిల్వనీటిలో దోమలు ఉంటాయన్నారు. దోమల కారణంగానే డెంగ్యూ సంభవిస్తుందన్నారు.
దోమల నిర్మూలన కోసం డ్రైనేజీలు, నిల్వనీటి ఆవాసాలపై యాంటీలార్వా స్ప్రే చేయించాలన్నారు. డెంగ్యూ నివారణ కోసం పైరీత్రమ్‌ మందు చల్లడం, ఫాగింగ్‌ వంటి చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. గ్రామసభల్లో డెంగ్యూ, మలేరియాపై అవగాహన కల్పించాలని పంచాయతీ రాజ్ శాఖను ఆదేశించారు.
ప్రతి ఒక్కరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలన్నారు.
డెంగ్యూ నివారణకు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వివరించాలన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ లాల్, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీనివాస్, అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకట దాస్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్,ఇతర వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు

Share This Post