నీటిపారుదల శాఖ ద్వారా హరితహారంలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలి….

నీటిపారుదల శాఖ ద్వారా హరితహారంలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలి….

ప్రచురణార్థం

నీటిపారుదల శాఖ ద్వారా హరితహారంలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలి….

మహబూబాబాద్, మే -05:

నీటిపారుదల శాఖ ద్వారా హరితహారంలో మొక్కలు నాటేందుకు ప్రాంతాలను గుర్తించి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. శశాంక అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ తో కలిసి నీటిపారుదల శాఖ అధికారులతో హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్ట్ లు, కెనాల్, ట్యాంక్ ల వద్ద ఎనిమిదవ విడత హరితహారం క్రింద మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని, మొక్కలు నాటేందుకు ప్రాంతాలను గుర్తించి ప్లాంటేషన్ చేసేవరకు అందరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 121 కిలో మీటర్ల మేరకు ప్లాంటేషన్ కొరకు భూమిని గుర్తించామని అధికారులు తెలుపగా, మొక్కలు నాటే భూమి హద్దులపై అధికారులకు అవగాహన కలిగి ఉండి, సిబ్బంది అందుబాటులో ఉండి హరితహారం మొక్కలు నాటే సమయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపారు. ఎంతమేరకు మొక్కలు నాటే అవకాశం ఉన్నది అడిగి తెలుసుకున్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మరొకసారి సమీక్షించడం జరుగుతుందని, అప్పటి వరకు పూర్తిగా ప్రాంతాలను గుర్తించి, ప్లాంటేషన్ కు అనువుగా ఉన్న ప్రాంతాల వివరాలను, కావాల్సిన మొక్కల వివరాలను అందజేయాలని తెలిపారు.

హరితహారంలో ఏ రకం మొక్కలు నాటాలనే అంశం పై సమీక్షించారు. టేక్, ఖర్జూర, ఇతర తమకు అనుకూలమైన మొక్కలను నాటాలని తెలిపారు. ఏమైనా ప్రత్యేకమైన మొక్కలు కావాలంటే ముందుగా తెలపాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, నీటిపారుదల శాఖ ఎస్. ఈ. కె. వెంకటేశ్వర్లు, ఈ. ఈ.లు ఎం.వెంకటేశ్వర్లు, కే. సుదర్శన్, కే. నారాయణ, డి.ఐ. ఓ. ఎ. పసంద్ కుమార్, డి. ఈ లు, ఈ.డి.ఎం. ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

———————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయము, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post