నీటి నిల్వలను తక్షణం తొలగించాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

నీటి నిల్వలను తక్షణం తొలగించాలి…

మహబూబాబాద్ ఆగస్టు-26:

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

గురువారం మున్సిపల్ పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్ శానిటేషన్ లను మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి తో కలిసి కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.

తొలుత జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించి రోడ్డు కో ప్లాంటేషన్ కు మధ్య ఉన్న చెత్తను తొలగించాలన్నారు. అదేవిధంగా బుష్ క్లియరెన్స్ చేయించాలని మొక్కకు ఏర్పాటు చేస్తున్న ట్రీ గార్డ్ మొక్క కు రక్షణ గా ఉండేందుకు క్రింది నుండి పై వరకు పటిష్టంగా ఉండే విధంగా వైర్ తో బిగింప చేయాలన్నారు.

అనంతరం నర్సంపేట రోడ్డు లోని ఆర్టీసీ కాలనీ వద్ద లోతట్టు ప్రాంతంలో నిలిచి ఉన్న నీరును తొలగింప చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

గాయత్రి గుట్ట వద్ద కాళీ ప్రదేశంలో లో పెరిగిన చెత్తను తొలగింప జేసీ క్రీడా స్థలాలుగా వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.

29వ వార్డు గుమ్ముడూరు హరిజన వాడలో రోడ్డుపై నిలిచిన నీటిని కలెక్టర్ పరిశీలిస్తూ ఇలాంటి ప్రాంతాలలో గుర్తించి పరిశుభ్ర పరచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

అనంతరం రామచంద్రపురం కాలనీ వద్ద గుమ్ముడూరులో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు.

ఇళ్ల నిర్మాణాలు నాణ్యతతో చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ వెంట R&B అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తానేశ్వర్ డి ఈ రాజేందర్ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి డి ఈ ఉపేందర్ తదితరులు ఉన్నారు
———————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post