*నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

*నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

*ప్రచురణార్థం-1*
జనగామ, నవంబర్ 24: సకల జీవరాశి మనుగడకు మూలాధారమైన నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సౌత్ రీజియన్, హైదరాబాద్ అధ్వర్యంలో భూగర్భ జల సమస్యలు, నిర్వహణ పై జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీ, నీటిపారుదల, త్రాగునీరు, భూగర్భ జల శాఖల అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూగర్భ జల వనరులను పెంచడానికి వాననీటి సంరక్షణ ఎంతో ముఖ్యమని అన్నారు. ఉపరితల జలం మన అవసరాలకు సరిపోవడం లేదని, భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఉపరితల రిజర్వాయర్ల కంటే భూగర్భ రిజర్వాయర్ల రీచార్జ్ వ్యయం తక్కువని ఆయన తెలిపారు. తెలంగాణ కు హరిత హరం, జల్ శక్తి అభియాన్ పథకం అమలు ద్వారా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. భూగర్భ జలాలు పెరగడంతో రైతులు వరి వైపు ఆసక్తి చూపారన్నారు. ఏ పంటకు ఎంత నీరు అవసరమో అంతే వాడితే బాగుంటుందన్నారు. చెక్ డ్యామ్ ల నిర్మాణం, చెరువుల మరమ్మతుల ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయిని, జల వనరులను సంరక్షించి ప్రకృతిని కాపాడుకొనడానికి అందరూ బాధ్యత ఉండాలని ఆయన తెలిపారు. జిల్లాలో బచ్చన్నపేటలో భూగర్భ జలాలు పెంచడానికి పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని పని చేసిన వారిని కలెక్టర్ అభినందించారు.
భూగర్భ జలవృద్ధికి వాన నీటి సంచయన వ్యూహలు, అనే ప్రత్యేక బుక్లెట్ ను ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, డిఆర్డిఓ జి.రాంరెడ్డి, ఆర్డి జె.సిద్ధార్ద్ కుమార్. శాస్త్రవేత్తలు డా.జి. రవికుమార్, డా. ప్రవీణ్ కుమార్,
డా. కార్లిన్ లూయిస్, డా.మాధవ్, పి. యాదయ్య, జిల్లా అధికారులు ఎంపిడిఒలు, ఎంపిఓలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post