నీతి అయోగ్ సహకారంతో చేపట్టిన పనులు నాణ్యతగా ఉండాలని నీతి అయోగ్ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు.

* ప్రచురణార్థం *.                                                                                              జయశంకర్ భూపాలపల్లి జనవరి 21 (శుక్రవారం).                                                                                                  నీతి అయోగ్ సహకారంతో చేపట్టిన పనులు నాణ్యతగా ఉండాలని నీతి అయోగ్ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం నీతిఅయోగ్  అడిషనల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో నీతి అయోగ్ కార్యక్రమం ద్వారా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా నీతి అయోగ్ అధికారి మాట్లాడుతూ ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాలలో పేదరికం స్థాయిని గుర్తించి నీతి అయోగ్ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో జిల్లాను ఎంపిక చేసి విద్య, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి పరిశ్రమ, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పన, ఆర్ధిక తోడ్పాటు, మౌలిక వసతుల కల్పన రంగాల్లో తోడ్పాటుకు అందించిన నిధులతో జిల్లాలో చేపట్టిన పనులు ఎక్కువ కాలం మన్నేలా ఆపనుల వల్ల జిల్లా ప్రజలు అభివృద్ధి చెందేలా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి  నాణ్యతగా చేపట్టాలని అన్నారు. నీతి అయోగ్ సహకారంతో చేపట్టిన పనుల అభివృద్ధి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేసి పంపించాలని, నీతి అయోగ్ ర్యాంకింగ్ లో జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా అభివృద్ధి పనులను నిర్వహించాలని అన్నారు.                      ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ  నీతి అయోగ్ సహకారంతో జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాలలో గల గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి 10 కోట్ల రూపాయలతో చర్యలు చేపట్టామని, ఆ నిధులతో అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులు, డిజిటల్ క్లాస్ రూమ్ ల ఏర్పాటు, స్మార్ట్ టీవీ ఏర్పాటు, కిచెన్ షెడ్ల ఆధునికీకరణ, ఆట వస్తువులు మరియు అభ్యసన సామాగ్రిని సమకూర్చుతున్నామని, సంబంధిత శాఖల అధికారులతో క్రమంతప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ నీతి అయోగ్ సహకారంతో జిల్లా అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు  చర్యలు చేపట్టామని వివరించారు.                                ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ డిస్టిక్ కో ఆర్డినేటర్ రాహుల్, జిల్లా గ్రామీణ అభివృద్ధిఅధికారి పురుషోత్తం, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీరాం, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, సిపిఓ (ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి) సామ్యూల్, విద్యాశాఖ ఏఎమ్ఓ మనోహర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.               డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post