నీరు నిల్వ ఉంచ రాదు… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్థం

నీరు నిల్వ ఉంచ రాదు…

మహబూబాబాద్, జూలై-30:

ఇండ్లల్లో నీటిని నిల్వ ఉంచరాదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

శుక్రవారం కలెక్టర్ మరిపెడ మండలంలో పర్యటించి అవెన్యూ ప్లాంటేషన్ ఫ్రైడే డ్రై డే, మెగా హరితహారం కార్యక్రమాల అమలు తీరును స్వయంగా సందర్శించి పరిశీలించారు.

ముందుగా మరిపెడ నుండి తొర్రూరు వెళ్ళే దారిలో అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు ఏర్పాటుచేసిన బ్రష్ వుడ్డు తక్షణం తొలగించాలని రంగురంగుల ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసి ఫోటోలను వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ లో నాటే మొక్కలు తప్పనిసరిగా మూడు అడుగుల పైగానే ఉండాలని అధికారులకు సూచించారు.

ప్రజా ప్రతినిధులు అధికారులతో ఫ్రైడే డ్రై డే పురస్కరించుకొని ఇస్లావత్ తండాలో పర్యటించారు నిల్వ ఉన్న నీటిని పరిశీలించారు కలుషితమైన నీటిని ప్రజలచే తొలగింప చేయించారు. నీటి నిలువ అవసరం ఉన్నంత వరకే చేసుకోవాలని ప్రతిరోజు సరఫరా అయ్యే నీటిని వినియోగించుకోవాలని అవగాహన పరిచారు

నీటి నిల్వ ద్వారానే డెంగ్యూ జ్వరాలు వస్తాయని, డెంగ్యూ దోమ మంచినీటి పైనే గుడ్లు పెడుతుందని ప్రజలకు వివరించారు దోమ లార్వా నిరోధించేందుకు ప్రతిరోజు అవసరం ఉన్నంత వరకే నీరు నిలువ పెట్టుకోవాలన్నారు. అదే గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న ఇంకుడు గుంతల పనితీరును పరిశీలిస్తూ అధికారులు తక్షణం శుభ్రపరచి ఫోటోలను అప్లోడ్ చేయాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా గ్రామస్థాయి అధికారులు పర్యటిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం బురహాన్ పురం వద్ద 10 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. గ్రామపంచాయతీ ఆదాయ వనరుగా శాశ్వత ప్రణాళిక చేపట్టాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఎత్తయిన పండ్ల నిచ్చే మొక్కలు అధికంగా నాటాలని వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి శారద రవీందర్, ఎంపీపీ అరుణ రాంబాబు, మండల ప్రత్యేక అధికారి సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ గణేష్, తాసిల్దార్ రమేష్ బాబు, ఎంపీడీవో కుమార్, ఏ పీ ఓ మంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post