నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం ను సాకారం చేసిన మహనీయుడు సిఎం కేసిఆర్:జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి

నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం ను సాకారం చేసిన మహనీయుడు సిఎం కేసిఆర్:జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి

————————————–

నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం ను సాకారం చేసిన మహనీయుడు సిఎం శ్రీ కేసిఆర్ అని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అన్నారు.

శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణం అంబేడ్కర్ భవన్ లో గ్రూప్ -2,3,4 ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న 200 మంది ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగ అభ్యర్థులకు 90 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం ను ప్రారంభించారు.

జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి లు
ముఖ్య అతిథులు గా హాజరై శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి మాట్లాడుతూ…..
సీఎం కేసిఆర్, మంత్రి కే టి ఆర్ ప్రత్యేక చొరవతో అంబేడ్కర్ భవన్ లో గ్రూప్ -2,3,4 ఉద్యోగాల కోసం ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఆనాడు అన్ని వర్గాలను సిఎం కేసిఆర్ ఏకం చేసారనీ అన్నారు. నినాదాలను నిజం చేస్తూ ప్రపంచమే అబ్బురపడేలా సాగునీటి ప్రాజెక్టులు కట్టి, మన నీళ్ల కలను, పెద్ద ఎత్తున ఉద్యోగాల ప్రకటనతో నియామకాల నినాదాన్ని నిజం చేశారనీ చెప్పారు.
ప్రభుత్వం పెద్ద ఎత్తున వెలువరిస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ లను జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ…
రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉద్యోగాల కు నోటిఫికేషన్ లు జారీ చేస్తుందన్నారు.
మంత్రి కే టి ఆర్ ప్రత్యేక చొరవతో ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగ అభ్యర్థులకు 90 రోజులు క్వాలిటీ ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
ఉద్యోగ పోటీ పరీక్షలకు అంకిత భావంతో సన్నద్ధం కావాలన్నారు.
ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనీ జిల్లా నిరుద్యోగులు ఉద్యోగాలను ఉద్యోగాలను చేజిక్కిoచుకోనీ తద్వారా జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు.
గ్రూప్ -2,3,4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగ అభ్యర్థులు మరింత మంది ఈ శిక్షణ ను సద్వినియోగం చేసుకోనేలా చూడాలనీ అధికారులకు సూచించారు.
పోటీ పరీక్షలలో విజేతలు కాకున్నా యువత నిరాశకు లోను కావద్దని ప్రైవేట్ రంగంలోనూ అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనీ అన్నారు.

మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ… ఈ ఉచిత శిక్షణ ను యువత సద్వినియోగం చేసుకోనీ ప్రభుత్వ కొలువులు సాధించాలని చెప్పారు.

కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, ఎస్సీ కార్పొరేషన్ ed వినోద్, జిల్లా పరిశ్రమల అధికారి ఉపేందర్ రావు , మైనార్టీ సంక్షేమ శాఖ OSD సర్వర్ మియా తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post