నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…

మహబూబాబాద్ ఆగస్టు-23:

జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం పై వైద్యాధికారులు జిల్లా ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల 23 వేల మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు ఆశా కార్యకర్తలు అంగన్వాడి సిబ్బంది లతో ఇంటింటికి తిరిగి నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నామని ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

0 నుండి రెండు సంవత్సరముల లోపు పిల్లలకు ఆల్బెండజోల్ సగం మాత్రను పొడిచేసి స్పూన్ తో నోటిలో వేయించడం జరుగుతుందన్నారు అలాగే 2సంవత్సరం ల నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు ఇచ్చి నమిలి మింగించడం వంటివి చేయడం జరుగుతుందన్నారు.

మండలాల్లో ప్రత్యేక అధికారులు మునిసిపాలిటీలలో కమిషనర్లు నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కొమరయ్య వైద్యాధికారులు మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు
—————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post