నూటికి నూరు శాతం ప్రయత్నం చేసి ఉద్యోగాలు సాధించాలి….

నూటికి నూరు శాతం ప్రయత్నం చేసి ఉద్యోగాలు సాధించాలి….

ప్రచురణార్థం

నూటికి నూరు శాతం ప్రయత్నం చేసి ఉద్యోగాలు సాధించాలి….

మహబూబాబాద్, మే -06:

నూటికి నూరు శాతం ప్రయత్నం చేసి ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

శుక్రవారం స్థానిక ఫైర్ స్టేషన్ ప్రక్కన గల సాంఘిక సంక్షేమ శాఖ ఆనంద నిలయంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు గ్రూప్స్ లో ఉచిత శిక్షణ కల్పించుట కు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ కె. శశాంక, జెడ్పీ ఛైర్పర్సన్ అంగోత్ బిందుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐదారెళ్ళ క్రితం ఒక విద్యార్థిగా ఉండి ఉతీర్ణత సాధించి వారి అనుభవాన్ని చెప్పారని, కలెక్టర్ సూచించిన విధంగా కష్టపడి ప్రయత్నం చేసి విజయం సాధించాలని కోరారు. నేను ఇక్కడికి మంత్రిగా రాలేదని, ఒక బిడ్డకు తల్లిగా వచ్చానని, ఈ శిక్షణా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కలెక్టర్ కోరిన విధంగా శిక్షణ శిభిరం వ్యవధిని 45 రోజుల నుండి 60 రోజులకు మారుస్తూ, రెసిడెన్షియల్ పద్ధతిలో బోధించెందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

20 ఏళ్లుగా చదివిన చదువుకు సార్థకత వచ్చే తరుణంలో మీరు కష్టపడి శిక్షణ తీసుకోవాలని, బ్రహ్మాండమైన ఫ్యాకల్టీ ని సమకుర్చామనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పంచాంగం సమయంలో శుభక్రుత నామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలుగుతాయని చెప్పారని, ఇంత మందికి ఉద్యోగాలు వస్తున్నందున ఈ సంవత్సరం ఉద్యోగ నామ సంవత్సరం అని చెప్పారు. మన ముఖ్యమంత్రి కే.సి.ఆర్. కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తేలపాలన్నారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో ఉన్న ఉద్యోగాలపై మీకు స్పష్టత ఉండాలని, ఏ ఉద్యోగం సాధించాలి అనే దానిపై కూడా అవగాహన ఉండాలన్నారు. ఈ శిక్షణ పొందాలంటే హైదరాబాద్ వెళ్లి అన్ని వసతులు స్వయంగా కల్పించుకొని దాదాపు కనీసం 45 వేల వరకు ఖర్చు అవుతుందని, స్థానికంగానే మీరున్న ప్రాంతంలోనే ఉచితంగా అందిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎక్కువ కష్టపడి, మనస్సు పెట్టీ శిక్షణ పొందాలని తెలిపారు.

ఉద్యోగ ప్రకటనల మధ్యలో కొంత వ్యవధి ఇచ్చి అన్ని ఉద్యోగాల్లో అవకాశం అంది పుచ్చుకునే విధంగా సమయం ఇవ్వడం జరుగుతున్నదని, ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దు అని తెలిపారు. తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదని, అవకాశం ఇస్తే ఎక్కడైనా నెగ్గుకు రాగలమని, రుజువు చేసుకోవలసిన సమయం వచ్చిందని తెలిపారు. తల్లిదండ్రులు పైసా, పైసా కూడబెట్టి చదివించారు అని, మన తాతలు, తల్లిదండ్రులు కష్టపడ్డారని, పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకుంటారని, వారి ఆశలను వమ్ము చేయకుండా కష్టపడి ఉద్యోగాలు సాధించాలని ఒక తల్లిగా కోరుతున్నాను అని చెప్పారు.

గతంలో 270 ఉన్న గురుకులాలను 976 కు పెంచుకున్నమని, ఆశ్రమ, గురుకులాల తో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో మన ఊరు మన బడి కార్యక్రమం రూపొందించుకొని ప్రభుత్వ పాఠశాలల్లో కావలసిన మౌలిక వసతులు కల్పించి, ఆంగ్ల మాధ్యమంలో బోధన కల్పించుట కు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని స్థానిక ఉద్యోగావకాశాలు లో ఉతీర్ణ త సాధించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున నోటిఫికేషన్ లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు స్థానికంగా మన ఉద్యోగాలు మనకు దక్కాలనే ఉద్దేశ్యంతో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ను రూపొందించారని తెలిపారు. ఉద్యోగాలు పొందుటకు పరీక్షల కొరకు హైదరాబాద్ వెళ్లి శిక్షణ పొందకుండా మన ప్రాంతంలో బెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ శాఖల ద్వారా అవకాశం కల్పించడం జరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన జిల్లావాసులు ఎక్కువ ఉద్యోగాలు సాధించేలా తర్ఫీదు పొందాలని కోరారు.

800 మంది పైగా విద్యార్థులలో మీరు ఎంపిక కావడం జరిగిందని, 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిక్షణా కార్యక్రమాన్ని మంత్రివర్యులు 60 రోజులకు మార్చి, రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని సభాముఖంగా మంత్రికి కోరారు.

గ్రూప్, ఇతర పోటీ పరీక్షలకు సిన్సియర్ గా ప్రయత్నించాలని, ఇప్పుడు మీ జీవితం, భవిష్యత్తు కోసం కష్టపడితే వచ్చే 60 ఏళ్లకు పైగా సుఖంగా ఉండవచ్చని, ఇప్పుడు సుఖపడితే భవిష్యత్తులో కష్టపడాల్సి వస్తుందన్నారు.

ప్రతి జిల్లాలో పోటా, పోటీగా అన్ని శాఖల ద్వారా శిక్షణ కల్పించడం జరుగుతున్నందున ఖచ్చితంగా ప్రయత్నం చేసి విజయవంతం అయి ఉద్యోగం సాధించాలని, ఏ ఉద్యోగంలో చేరాలి అనే ఆలోచన ముందుగా ఏర్పరచుకొని దానికి తగ్గట్టుగా, మనకు మనం జవాబుదారీతనంతో ప్రయత్నం చేయాలని సూచించారు. మనం ఎంత సేపు చదివిన స్థిరత్వం తో మార్కులు వస్తాయని, ఆరోగ్యంపై శ్రద్ధ గా ఉంటూ, సెల్ ఫోన్ లకు, సోషల్ మీడియా, టి.విలకు దూరంగా ఉంటూ శిక్షణ పొందాలని తెలిపారు. నూటికి నూరు శాతం ప్రయత్నం చేసి మన జిల్లా నుండి ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలని తెలిపారు.

జెడ్పీ ఛైర్పర్సన్ మాట్లాడుతూ, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, బెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా కల్పించిన శిక్షణను పొంది విజయం సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డి.టి.డి. ఓ. దిలీప్ కుమార్, జెడ్పీటీసీ కురవి వెంకట్ రెడ్డి, PACS బయ్యారం మధుకర్, గురుకులం శిక్షకులు శివశంకర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

MAHA

Share This Post