ప్రచురణార్థం
నూటికి నూరు శాతం సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలి………రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు..
మహబూబాబాద్, మే – 10:
నూటికి నూరు శాతం సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలనీ రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు తెలిపారు.
మంగళవారం స్థానిక నందన గార్డెన్ లో మంత్రి హరీష్ రావు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి మాలోతు కవిత, ప్రజాప్రతినిధుల తో కలిసి వైద్య, ఆరోగ్య శాఖ, పి.హెచ్.సి. కేంద్రాల డాక్టర్ లతో, డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ, ఆయుష్, ఆడిట్, ట్రెజరీ, ఇన్సూరెన్స్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సి సెక్షన్ లను అరికట్టాలని, సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని, లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించాలని తెలిపారు. AMC నమోదు పెంచాలని తెలిపారు.
అన్ని సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించి ప్రజల మన్ననలు పొందాలని, మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పించి నిధులు మంజూరు చేస్తున్న సందర్భంలో సమర్థవంతంగా సేవలు అందిస్తూ మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.
జిల్లా ఎంక్వాష్. సర్టిఫికేట్ లు సాధించే విధంగా ప్రతి పి.హెచ్.సి. ప్రయత్నం చేయాలని, లాబ్ టెక్నీషియన్ లేని ప్రాంతంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఏర్పాటు చేయాలని, పల్లె దవాఖానలో ఉన్న వారిని డిప్యూటేషన్ వేయాలని సూచించారు. అలాగే పి.జి. వచ్చి వెళ్లి ఖాళీ అయిన స్థానాల్లో ఎం.బి.బి.ఎస్.డాక్టర్ లను వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిన నియమించాలని తెలిపారు.
చిన్న పిల్లల ఐ.సియు మంజూరు చేసుకొని పూర్తి సామర్థ్యంతో అందించామని, సర్కార్ దవాఖానలో పిల్లలకు వైద్యం అందించి ప్రైవేట్ వైపు వెళ్లకుండా చూడాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాలి ఆపరేషన్, అన్ని ఆపరేషన్ లు చేయాలని తెలిపారు.
ప్రజా రక్షకులుగా ఉండి సేవలు అందించాలని, సి సెక్షన్ ను తగ్గించాలని, మార్పు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో అధికంగా పెద్దాపరేషన్ ళ్లు చేస్తున్నారని, వాటిని అరికట్టి ప్రభుత్వ ఆస్పత్రులపై గర్భిణీ స్త్రీలకు తల్లీబిడ్డల సంరక్షణకై వారికి నమ్మకం కలిగించి ప్రభుత్వ ఆస్పత్రిలోనే సాధారణ ప్రసవాలు అయ్యేటట్లు తగు చర్యలు తీసుకోవాలని మంత్రి డాక్టర్లను కోరారు.
నార్మల్ డెలివరీ చేసిన సందర్భంలో పిల్ల తల్లికి 13 వేలు, కె.సి.ఆర్. కిట్ అందిస్తున్నమని, నార్మల్ డెలివరీ చేసిన వైద్య టీమ్ కు ప్రోత్సాహకంగా 3 వేల రూపాయలు ప్రతి నార్మల్ డెలివరీ కి అందించే విధంగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ప్రతి పేషంట్ పూర్తి చికిత్స తీసుకునే వరకు అక్కడే వుండాలని, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే క్రొత్త రిక్రూట్మెంట్ లో ప్రాక్టీస్ చేయకుండా నిబంధన పెట్టాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.
వైద్య సేవలు విస్తృతం చేసి పేదలకు లాభం చేకూర్చాలని తెలిపారు. నార్మల్ డెలివరీ లను ప్రోత్సహించాలని, పాము, కుక్క, తేలు కాటుకు మందులు ఉంచుకొని అర్ధరాత్రి వస్తే ట్రీట్ మెంట్ చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని తెలిపారు. ప్రతి ప్రభుత్వ దవాఖానలో అన్ని మందులు ఉచితంగా అందించాలని, బయటికి మందుల కొరకు చిట్టి రాయారాదని తెలిపారు. 500 కోట్లతో మందులకు సర్జికల్స్ కాంజ్యుమొబుల్స్ కు కేటాయించి నట్లు మంత్రి తెలిపారు. టెలి కన్సల్టేషన్ పెంచాలని, టి డయాగ్నొస్టిక్ సేవలు పెంచాలని తెలిపారు.
వివిధ 56 రకాల పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయాలని, పరీక్షలు చేసిన తర్వాత 24 గంటల్లో సెల్ ఫోన్ కు మెసేజ్ పంపాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ కె శశాంక, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, మానుకోట ఎంపీ మాలోత్ కవిత, స్థానిక శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, జెడ్పి చైర్ పర్సన్ ఆంగోతు బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు డిఎంఅండ్హెచ్ఓ హరీష్ రాజ్, జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ వెంకట్రాములు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, డి ఎం ఈ రమేష్ రెడ్డి, హెల్త్ కమిషనర్ అజయ్ కుమార్,సి ఈ టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి రాజేంద్ర కుమార్ డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ లు మురళీధర్ అంబరీష్, మున్సిపల్ చైర్ పర్సన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.