నూతనంగా ఓటర్లుగా నమోదైన వారికి ఓటరు కార్డులు అందించాలి వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ జిల్లా వ్యాప్తంగా ఓటరు కార్డులు అందించేందుకు చర్యలు : కలెక్టర్ హరీశ్

నూతనంగా ఓటర్లుగా నమోదైన వారికి ఓటరు కార్డులు అందించాలి

వీడియో కాన్ఫరెన్స్​లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్​ గోయల్​

జిల్లా వ్యాప్తంగా ఓటరు కార్డులు అందించేందుకు చర్యలు : కలెక్టర్ హరీశ్​

ప్రభుత్వం నూతనంగా ఓటర్లుగా నమోదు చేసుకొన్న వారికి సంబంధించి ఓటరు తుది జాబితాలను ఓటర్లకు (ఎపిక్​) ఓటరు కార్డులను అందచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్​ గోయల్​ అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. నూతనంగా ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకొన్న వారికి ఈనెల 25న ఓటరు దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్లకు ఓటరు (ఎపిక్​) కార్డులను అందచేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈనెల 5వ తేదీన ఓటరు తుది జాబితా రూపొందించామని వాటిలో 18 సంవత్సరాల వయస్సు దాటిన వారిని కొత్తగా పేర్లు నమోదు చేసుకొన్నారని ఈ మేరకు జాతీయ ఓటరు దినోత్సవమైన ఈనెల 25న ఓటరు గుర్తింపు కార్డులు, అందుకు సంబంధించిన కిట్లను  అందచేయాలన్నారు. అలాగే జిల్లాల్లో నూతనంగా నిర్మించి ప్రారంభించుకున్న ఈవీఎమ్​ల గోదాములలోకి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు వారం రోజుల్లో తరలించాలని శశాంక్​ గోయల్ అధికారులకు వివరించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని  కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఈ విషయాలపై అధికారులకు పలు సూచనలు  చేశారు.

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ హరీశ్​ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఓటర్లుగా నమోదైన 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులకు సంబంధించి ఓటరు (ఎపిక్​) కార్డులను జాతీయ ఓటరు దినోత్సవమైన ఈనెల 25న అందచేస్తామని అందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ఉందని రాష్ట్ర అధికారి శశాంక్​ గోయల్​కు వివరించారు.  అలాగే అధికారుల సూచనల మేరకు కొత్త ఓటర్లకు ఫొటో ఓటర్​ గుర్తింపు కార్డుతో పాటు ఓటరు కిట్​ను అందులో వ్యక్తిగత లేఖ, ఓటరు గైడ్​, ప్రతిజ్ఞ వంటి వాటిని కూడా అందించనున్నట్లు కలెక్టర్​ హరీశ్​ తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని ప్రస్తుత కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని నిర్వహిస్తామని పేర్కొన్నారు.  ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని దీంతో పాటు ఓటర్లకు సంబంధించి ఆయా మార్పులు, చేర్పులు, సవరణకు వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్​ హరీశ్​ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్​లో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, ​, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​, డి ఈ ఓ ,ప్రసాద్, ఏఓ ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post