నూతనంగా జిల్లాకు వచ్చిన తెలంగాణ సాంసృతిక సారధి కళాకారులు మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసి శాలువా, పూల బొకేతో సన్మానించారు

పత్రికా ప్రకటన.     తేది:02.08.2022, వనపర్తి.

తెలంగాణ సాంసృతిక సారధి ఆధ్వర్యంలో యువకులకు ఉద్యోగం కల్పించడం సంతోషమైన విషయమని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష హర్షం వ్యక్తం చేశారు.
సోమవారం ఐ డి ఓ సి జిల్లా కలెక్టర్ చాంబర్లో టీ.ఎస్.ఎస్. కళాకారులు జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణ సాంసృతిక సారధి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కు (14) మంచి కళాకారులు, కళాకారిణులకు అవకాశం కల్పించినందుకు ఆమె సంతోషిస్తూ వారికి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చాంబర్లో నూతనంగా జిల్లాకు వచ్చిన సాంస్కృతిక సారథి కళాకారులు జిల్లా కలెక్టర్ కు శాలువా, పూల బొకేతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం.ఏ. రషీద్, టి ఎస్ ఎస్. కళాకారులు శ్రీనివాసులు, కృష్ణయ్య, శివలింగం, రాజు, నరసింహ, సువర్ణ, రాధా, శ్రీను, కళాకారులు, ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post