నూతనంగా నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన,  తేది:2.11.2021, వనపర్తి.

నూతన సమీకృత జిల్లా కలెక్టర్ భవన పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంభందిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం పట్టణ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సివిల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అందమైన మొక్కలు ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించాలని ఆమె సూచించారు. అప్రోచ్ రోడ్డు పనులు పూర్తిచేయాలని ఆమె సంభందిత అధికారులను ఆదేశించారు. టేకోమ చెట్లు మధ్య మధ్యలో పెంచాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వన్, జిల్లా హార్టికల్చర్ అధికారి సురేష్, మున్సిపల్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బి డి.ఈ. దేశ్య నాయక్, అటవీ శాఖ అధికారిని వాణి తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post