నూతన ఆవిష్కరణలకు దరఖాస్తులు ఆహ్వానం – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జులై 29, 2021ఆదిలాబాదు:-

            శాస్త్రీయత కలిగిన వినూత్న ఆలోచనలను ఆవిష్కరించేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం క్రింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున తన క్యాంపు కార్యాలయంలో ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్ లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, శాస్త్రీయ స్వభావం కలిగిన వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పిస్తామని, అనుభవం, ఆసక్తి, అర్హత కలిగిన ఎవరైనను వయసుతో నిమిత్తం లేకుండా తమకు తోచిన ఆవిష్కరణలను ఆగస్టు 10 లోగా పూర్తీ వివరాలను 9100678543 అనే వాట్సాప్ నంబర్ కు పంపవచ్చని తెలిపారు. ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా ఆన్ లైన్ లో ఆవిష్కరణలు ప్రదర్శింప బడిన ఆవిష్కర్తలు నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ఆరు వాక్యాలు లఘు సంక్షిప్తంగా, రెండు నిమిషాల వీడియో, నాలుగు ఫోటోలు,ఆవిష్కర్త పేరు, ఫోన్ నంబర్, వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామం, జిల్లా పేరు, వివరాలను వాట్సాప్ నంబర్ కు పంపించగలరని తెలిపారు. ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం కేవలం పాఠశాల విద్యార్థులకే కాకుండా ఆసక్తి గల గ్రామీణ, పట్టణ ప్రాంత యువకులు, వ్యవసాయ అనుబంధ వ్యక్తులు, సాంకేతిక నైపుణ్యం కలిగిన వారు, ఇతర ఏ రంగానికి చెందిన వారైనా తమకు తోచిన కొత్త ఆలోచనలను ఆవిష్కరించే వేదికనే ఇంటింటా ఇన్నోవేటర్ అని పేర్కొన్నారు. ఇందులో అన్ని రంగాల వ్యక్తులు ఒక సమస్యకు పరిష్కారం కనుగొన్న, పరిష్కర విధానం కొత్తగా ఉన్న, పరికరాలు వినూత్న పద్దతిలో ఉపయోగించినా, ఉన్నదానికి మరొక ఆలోచన జతచేసి దాని ఉపయోగాలు పెంచి సులువుగా ఉపయోగించే పద్దతులను, ఇంటి పరిసరాలలో, విద్యాలయాల్లో, పరిశ్రమలలో, వ్యవసాయ సంబంధంతో పాటు ఏ రంగానికి సంబంధించినదైనప్పటికీ వినూత్న ఆలోచన తో కనుగొనబడుటకు ఇంటింటా ఇన్నోవేటర్ వేదికగా నిలువనున్నదని తెలిపారు. ఆవిష్కర్తలు పంపిన వాటిని స్వాతంత్ర దినోత్సవం రోజున పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్షింపబడి, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, అధికారులు పరిశీలించి రాష్ట్ర స్థాయికి ఆవిష్కరణలను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఇతర వివరాలకు జిల్లా సైన్సు అధికారి కె.రఘు రమణ సెల్ నంబర్ 9440060288 కు సంప్రదించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఇన్నోవేటర్ పోస్టర్ లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్య శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, EDM రవి, జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి పి.అశోక్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ అశోక్, ASO మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post