నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రాంగణంలో పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలను విరివిగా నాటాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

పత్రికా ప్రకటన
తేదీ 23.03.2023

నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రాంగణంలో పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలను విరివిగా నాటాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

నూతన కలెక్టరేట్‌ ఆవరణలో జరుగుతున్న బ్యూటిఫికేషన్ పను లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ పి ఉదయ్ కుమార్ అన్నారు. కొల్లాపూర్ చౌరస్తా నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని నూతన కలెక్టరేట్‌ బ్యూటిఫికేషన్ పనుల ను గురువారం కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అటవీ శాఖ, హార్టికల్చర్ అధికారితో సమన్వయం చేసుకొని పండ్లు ఇతర పూల మొక్కల నాటే ప్రక్రియను వారంలో పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకుని పూర్తి చేయాలన్నారు.
ఆవరణలో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ దట్టమైన గ్రీనరీ ప్రాంతంగా తీర్చిదిద్దాలని జిల్లా అధికారులను ఆదే శించారు.
ఏ రకమైన మొక్కలను ఎక్కడ నాటాలి మొక్కల సైజులను హార్టికల్చర్ అధికారితో చర్చించి వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఏప్రిల్ మాసంలో నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, అధికారులు మొక్కల నాటే ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ స్థలం కనబడకుండా పండ్ల పూల మొక్కలతో సుందరీకరణ పనులకు అధిక ప్రాధాన్యత ఇయ్యాలని అధికారులను ఆదేశించారు.
రానున్న వారం రోజుల్లో అన్ని పనులు పూర్తయ్యేలా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
చిన్న చిన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
సుందరీకరణ పనుల పురోగతిపై అధిక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మను చౌదరి, అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర రావు, ఆర్ అండ్ బి డిఈ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ యాదయ్య, ఇంజనీర్లు తదితరులు ఉన్నారు.

………… ……………. …. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం నాగర్ కర్నూల్ నుండి జారీ చేయడం అయినది.

Share This Post