నూతన ఉత్తేజంతో విధులు నిర్వర్తించాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

నూతన సంవత్సరంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నూతన ఉత్తేజంతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ పీ ఉదయ్ కుమార్ సూచించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అధికారుల నుంచి శుభాకాంక్షలు అందుకున్న కలెక్టర్ అధికారులకు అభినందనలు తెలిపి జిల్లా ప్రజలకు తమ వంతు సేవచేస్తూ విధులు నిర్వర్తించాలన్నారు.
కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భాన జిల్లాలో కొత్త ఒరవడితో ఆయా శాఖల్లోని అధికారులు ప్రజలను తిప్పుకోకుండా వెంటనే వారి పనులను పూర్తి చేయాలన్నారు. కాగా కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో కలెక్టర్‌కు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి నాగర్ కర్నూలు ఇంచార్జి తహసిల్దార్ ఖాజా, పలువురు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Share This Post