నూతన ఓటర్లకు ఓటరు కార్డులు పంపిణీ చేయాలి -రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్

నూతన ఓటర్లకు ఓటరు కార్డులు పంపిణీ చేయాలి -రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్

ప్రచురణార్థం

నూతన ఓటర్లకు ఓటరు కార్డులు పంపిణీ చేయాలి -రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్

పెద్దపల్లి జనవరి 12:-

నూతనంగా ఓటరు జాబితాలో నమోదు చేసిన ఓటర్లకు ఓటరు కార్డులు పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

జాతీయ ఓటరు దినోత్సవం, నూతన ఓటరు జాబితా, తదితర అంశాలపై బుధవారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జనవరి 5న తుది ఓటరు జాబితా రూపొందించామని, అందులో 18 సంవత్సరాల వయస్సు నుండి నూతనంగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు జాతీయ ఓటరు దినోత్సవం నాడు నూతన ఓటర్ కార్డు, కిట్ అందజేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహణపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1602 నూతన ఓటర్లు నమోదు అయ్యారని, వీరికి ఓటర్ కార్డు అందించే దిశగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, సూపరింటెండెంట్ తూము రవీందర్, డిప్యూటీ ఎన్నికల తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

Share This Post