నూతన కలెక్టరేట్​ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి

పత్రిక ప్రకటన

తేదీ : 27–08–2022

నూతన జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ
నూతన కలెక్టరేట్​ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ
మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి
మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా నిర్మించిన షామీర్​పేటలోని జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో (నూతన కలెక్టరేట్​ కార్యాలయం) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని షామీర్​పేటలోని అంతాయిపల్లి వద్ద నిర్మించిన నూతన జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి నూతన భవనంలో ప్రజావాణికి రావాలని అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.

Share This Post