నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో అధికారులందరూ బాధ్యతాయుతంగా ఉండాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

పత్రిక ప్రకటన

తేదీ : 15–08–2022

నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో అధికారులందరూ బాధ్యతాయుతంగా ఉండాలిఅధికారులకు అప్పగించిన పనులను వారు పకడ్భందీగా చేపట్టాలిఅధికారుల సమీక్ష సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్.

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ఈనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నందున అందుకు అవసరమైన పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయాలని ఈ విషయంలో అధికారులందరూ వారికి అప్పగించిన బాధ్యలను సమర్ధవంతంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈనెల 17న (బుధవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సంబంధించి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయిలో ఒక్కో అధికారికి ఒక్కో బాధ్యతను అప్పగించడం జరిగిందని తెలిపారు.  జిల్లా స్థాయి అధికారులందరూ వారికి కేటాయించిన పనులను సమర్ధవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే సమయం నుంచి తిరిగి వెళ్ళేంత వరకు జిల్లా అధికారులతో పాటు పోలీసులు సమన్వయం చేసుకుంటూ ఉండాలని అలాగే ప్రజాప్రతినిధులతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయంతో ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎల్లప్పుడూ అప్రమత్తతో ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఇప్పటికే అధికారులు చేయాల్సిన పనులను అప్పగించామని అదే విధంగా పనులలో పురోగతి ఉండాలన్నారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం వచ్చే మార్గం నుంచి మొదలుకొని వేదిక వరకు అన్ని కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ విషయంలో ఒకే రోజు సమయం ఉన్నందున అధికారులకు అప్పగించిన బాధ్యతలను ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందుగానే ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాల్సందిగా కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. విద్యుత్తు శాఖ అధికారులు బుధవారం రోజున కలెక్టరేట్ ప్రారంభోత్సవ సమయంలో కరెంట్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది, అంతరాయం కలగకుండా చూడాలని అందుకు ముందుగానే సబ్స్టేషన్ నుంచి మొదలుకొని ఆయా ట్రాన్స్ఫార్మర్లు, కలెక్టరేట్ ఆవరణలో జనరేటర్ను కూడా సమకూర్చుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కలెక్టర్ హరీశ్ తెలిపారు. ప్రొటోకాల్ విషయంలో సైతం వీఐపీలు, ప్రజాప్రతినిధులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ఒక రోజు సమయం మాత్రమే ఉన్నందున సంబంధిత అధికారులకు కేటాయించిన పనులను పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంసన్, లింగ్యానాయక్,  కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు రవి, మల్లయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post