నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి::జిల్లా కలెక్టర్ శశాంక

నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

బుధవారం నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను అధికారులతో కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.

కార్యాలయం భవన నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు ఆడియో విజువల్ మీటింగ్ హాల్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లను సందర్శించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గదుల నిర్మాణ పనులను సదర్ విభాగాలన్నీ కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థల సేకరణ చేయాలని తాసిల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు. హెలిప్యాడ్ నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు

కార్యాలయం ముందు భాగంలో పార్కు, వాహనాల పార్కింగ్ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తానేశ్వర్, డి.ఈ. రాజేందర్, విద్యుత్ శాఖ ఎస్.ఈ. నరేష్, తాసిల్దార్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post