నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి…

ప్రచురణార్ధం

నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి…

మహబూబాబాద్, 2021 డిసెంబర్-23:

నూతన కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం జిల్లా కలెక్టర్ డి.ఎఫ్.ఓ రవి కిరణ్ తో కలిసి నూతన కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణ పనుల పురోగతిని సందర్శించి పరిశీలించారు.

భవన నిర్మాణం, ప్రాంగణానికి సంబందించిన
ప్లాన్ ను పరిశీలిస్తూ, ప్లాన్ ప్రకారంగా పనులను పరిశీలించారు.

భవన ప్రాంగణం ముందు భాగం మొత్తం చదును చేయాలని, చదును చేసిన అనంతరం నడక దారి, కాంపౌండ్ వాల్ చేపట్టాలని సూచించారు. నడక దారి, కాంపౌండ్ వాల్ పూర్తి చేసిన తర్వాత హార్టికల్చర్ తో సమన్వయం చేసుకొని ప్లాంటింగ్, లాన్ ఏర్పాట్లను చేపట్టలన్నారు.

నిర్మిస్తున్న సెప్టిక్ ట్యాంక్ కెపాసిటీ వివరాలను, వాటర్ ట్యాంక్ సామర్థ్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

భవన సముదాయం వెనక భాగంలో సీసీ రోడ్డు, పాత్ వే పనులను పరిశీలించారు. భవనం గోడకు ఆనుకొని pot planting ఉండాలని, ఆ తర్వాత వరుసలో మొక్కలు ప్లాంటేషన్ చేసి, ప్లాంటేషన్ తర్వాత సీసీ రోడ్ చేపట్టాలన్నారు.

భవన సముదాయం మధ్యలో చేపట్టవల్సిన ప్లాంటింగ్, lawn పనులను సుందరంగా కనబడేట్లు చేపట్టాలన్నారు.

వాహనాల పార్కింగ్, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తవుతున్న పనుల వివరాలను ప్రగతి నివేదికల ద్వారా అందివ్వాలన్నరు.

ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తానేశ్వర్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న, తహశీల్దార్ రంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post