నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలి…

ప్రచురణార్థం

నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 6.

కురవి రోడ్ లో 62 కోట్లతో 21 ఎకరాలలో నిర్మిస్తున్న నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ శశాంక సోమవారం సందర్శించి పరిశీలించారు.

రోడ్లు భవనాల అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం నిర్మాణ పనులను కలెక్టర్ పర్యవేక్షించారు.

భవన నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం చేపడుతున్న పనుల వివరాల నివేదికను కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అందజేయాలన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కార్యాలయం నిర్మాణానికి వినియోగించిన నిధుల వివరాలను చేపట్టిన పనులను నివేదిక రూపొందించి ఇవ్వాలన్నారు.

వర్షాలు తగ్గగానే కార్యాలయం చుట్టూ మొక్కలు నాటేందుకు స్థలం సిద్ధం చేయాలన్నారు.

కలెక్టర్ వెంట రోడ్లు భవనాలు కార్యనిర్వాహణ ఇంజనీర్ తానే శ్వర్ డి ఈ రాజేందర్ తాసిల్దార్ రంజిత్ కాంట్రాక్టర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు
————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post