మంగళవారం నాడు ఆమె నూతనంగా నిర్మితమవుతున్న కలెక్టరేట్ భవన సముదాయ పనులను, సమావేశపు హాల్స్, వివిధ ఛాంబర్స్ కలియతిరిగి పరిశీలించారు. గార్డెనింగ్ లో పెద్ద మొక్కలతో, రకరకాల పూల మొక్కలతో సిద్ధం చేయాలని సూచించారు.
కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శంకరయ్య, ట్రాన్స్కో ఎస్.ఇ. లింగారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
నూతన కలెక్టరేట్ భవన సముదాయ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.