నూతన కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

నూతన కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

నూతన కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, మే -06:

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ కార్యాలయ భవనం సముదాయ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కె. శశాంక శుక్రవారం డి.ఎఫ్. ఓ రవికిరణ్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేస్తున్న లాన్, ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. కలెక్టరేట్ లో ఆహ్లాదకర వాతావరణం కల్పించే విధంగా ప్లాంటేషన్, లాన్ ఏర్పాటు ఉండాలని తెలిపారు. ప్రహరీ గోడలకు, ఫెన్సింగ్ కు నిర్ణీత దూరంలో అవసరమైన చోట మూడు, ఐదు వరసల ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని, ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ కు నీటి లభ్యత కొరకు బావి నుండి, సంప్ ల ద్వారా నీటి సరఫరా అయ్యే విధంగా చూడాలని, పైప్ లైన్ కు ఔట్ లెట్ పాయింట్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

వాహనాల పార్కింగ్ కు ఇబ్బందులు లేకుండా ఎక్కువ మొత్తంలో పార్కింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటూ ప్లాంటేషన్ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా భవనం లోపల జరుగుతున్న పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో డి.ఎఫ్. ఓ. రవికిరణ్, ఆర్ అండ్ బి ఈ. ఈ. తానేశ్వర్, ఏజెన్సీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post