ప్రచురణార్ధం
ఆగష్టు 19 ఖమ్మం:
నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను, ఏజెన్సీ బాధ్యులను ఆదేశించారు. నూతన కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణ పనుల పురోగతిని గురువారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణపనులను మరింత వేగవంతం చేయాలని ఎక్కువ మంది లేబర్తో నిరంతరాయంగా పనులు కొనసాగాలని, ప్రతి వారం పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల్లో జాప్యం సరికాదని, ఆశించిన మేరకు పురోగతి లేదని ఇకనుండి ప్రతి వారం పనుల్లో పురోగతి ఉండాలని నిరంతరం పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు, ఏజెన్సీ బాధ్యులు నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అంతకు ముందు నగరంలోని టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ గృహసముదాయాలలో ఇంకనూ మిగులు దశలో ఉన్న గృహాల పనులను కలెక్టర్ పరిశీలించారు. ముగింపు దశలో ఉన్న గృహసముదాయాలలో విద్యుత్ కనెక్షన్లు, ఫ్లోరింగ్, త్రాగునీటి సరఫరా పనులను వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఇంకనూ ప్లాస్టింగ్, ఫ్లోరింగ్ పనులతో పాటు గృహసముదాయాలలో అవసరమైన మౌళిక వసతుల పనులను త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు శ్యాంప్రసాద్, ఇ.డబ్ల్యూ ఐ.డి.సి ఎగ్జిక్యూటీవ్ వీరుపాక్షి, అర్బన్ తహశీల్దారు శైలజ, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.