నూతన కలెక్టరేట్ ముగింపు పనులను యుధ్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ కె. శశాంక

నూతన కలెక్టరేట్ ముగింపు పనులను యుధ్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్ధం.
సెప్టెంబర్.22
మహబూబాబాద్.

నూతన కలెక్టరేట్ ముగింపు పనులను యుధ్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.
స్ధానికసంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయా న్ని గురువారం కలెక్టర్ సందర్శించి సుందరీకరణ, ముగింపు పనులను పరిశీలించారు. సముదాయంలోని లాన్, గ్రీనరీ పనులను కలెక్టర్ పరిశీలించారు. సుందరీకరణపై అధికారులకు పలు ఆదేశాలు చేశారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో గ్రీనరీ ఆకర్షణీయంగా ఉండాలని తదనుగుణంగా వివిధ రకాల పూలు, ఇతర మొక్కల ప్లాంటేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. దీనితో పాటు సమావేశ మందిరంలో సీటింగ్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఫ్లోరింగ్ ఫినిషింగ్, విద్యుచ్ఛక్తి పనులను
సరిచూసుకోవడం, సూచికలు బోర్డ్ లు ఫర్నీచర్ ఏర్పాటు , తదితర ముగింపు పనులను 24గంటలు నిరంతరాయంగా కొనసాగించి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా ఉద్యానవన అధికారి సూర్యనారాయణ, రోడ్లుభవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తానేశ్వర్, జిల్లా మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖాధికారులు వెంకట్ రెడ్డి, డా. సుధాకర్, విద్యుత్ శాఖ డి.ఈ.సునీత మున్సిపల్ కమిషనర్ ప్రసన్న, గుత్తేదారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post