ప్రచురణార్థం
నూతన కలెక్టరేట్ లో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.
మహబూబాబాద్, ఏప్రిల్ -30:
శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆర్.డి.ఓ. కొమురయ్య తో కలిసి నూతన కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటుకు గుర్తించిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇంటర్నల్ రోడ్డు పనులు, డ్రైనేజ్, వాటర్ లైన్, భవనం చుట్టూ ప్రహరీ, ఇతర పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆర్. అండ్ బి ఈ. ఈ. తానేశ్వర్, ఏ.డి. మైనింగ్, కాంట్రాక్టర్, తదితరులు పాల్గొన్నారు.
—————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.